భావజాలం

కవి అంటే ‘కనిపించదు వినిపించదు’ అని చాలా మంది తమాషాగా అంటూ ఉండడం వింటుంటాం …కానీ, నిజానికి ‘కనిపించనిది కూడా చూడగలిగే వాడు, వినిపించనిది సైతం వినగలిగే వాడు’ కవి …………………………………………………………………………………………

అందానికే ఆక్రుతివి నీవేనేమో బహుశా
నిన్ను తలచిన హృదయం వెలవెలబోతోంది తెలుసా
నిన్ను తీస్కోస్తానని ఇచ్చి భరోసా
నన్ను వీడి పోతానంటోంది హమేషా
నిలకడ లేని నిర్జీవినయ్యానో
స్పర్శకు నోచని, శూన్యమవుతానో
భూమికె భారమవుతనో
గాలిలో లీనమవుతనో
నింగిలో  ఆవిరవుతానో
వర్షమై నిన్ను చేరెదనో
ఏమవుతానో తెలియదు నాకు నీకై వీచే ఈ యత్నంలో
లోకం మొత్తం చుట్టేస్తాలే నీ దరి చేరే ఈ మార్గంలో

——————————————————————–

కానరాని లోకాల్లో కూడా కళల సుగంధాలను నింపుటకు…
తను కన్న కలలకు సార్థకత అందించిన కాలాన్ని వీడి,
తన చేతుల జాలువారిన సృజనాత్మకతను మనకై వదిలి
చిరకాల మిత్రుడి కోసం చేరరాని లోకాలకు పయనమయ్యారు
కళా ప్రపంచంలో చెరగని చిత్రమై మిగిలిపోయారు……….బాపు గారు

——————————————————————–

ప్రతి బాధ అరిష్టమే
కష్టపడి జీవించేవాని ప్రతి కన్నీటి చుక్క దేశానికి అరిష్టమే …
ఆకలి చావులతో చచ్చే ప్రతి ఆకలి ఆవేదన అరిష్టమే
కడుపు నింపే రైతన్నల కడుపుకోతలు అరిష్టమే
దాహార్తిని పొందలేక విధికి దాసోహం అయ్యే ప్రతిదీ అరిష్టమే…
కొన ప్రాణంతో కొట్టుమిట్టాడే తిరుగుబాటు దారుని చావు కేక అరిష్టమే
మంచి చెడుకు తేడా తెలసి ఏమి చెయ్యలేని అసహాయత అరిష్టమే

——————————————————————–

నిజమైన స్నేహితులు ఎప్పుడు కలిసినా, కలవక పోయిన
ఎప్పుడో కలిసినా, ఎపుడూ కలిసున్నట్టుగానే ఉంటుంది

—————————————————————

 

Advertisements

Say what you experienced

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s