ఓంకారం…

శక్తి శక్తి శక్తి, ఇది మూలమంత్ర శక్తి
శక్తి శక్తి శక్తి, ఇది ముక్తినిచ్చుసూక్తి, ఇదె ఓంకార శక్తి
||పల్లవి||
ఓంకారం సృష్టికి రూపం, ఓంకారం శ్వేతసువర్ణం
ఓంకారం మోక్షమిచ్చు మార్గం
ఓంకారం జీవన నాదం, ఓంకారం జీవన వేదం
ఓంకారం సృష్టి నిలుపు మూలం
యుగయుగాలుగా ధర్మాధర్మాలు ధరియించిన ఈ ఓంకారం
తిరుగుచున్న ఈ జీవన చక్రపు జ్ఞానచక్షువీ ఓంకారం
సర్వ శక్తుల సమ్మోహనం, ఔన్నత్యమౌ ఆరంభం
దివ్య శక్తియై దివిని నడుపు బహు దివ్యమైనదీ ఓంకారం
ఓంకారం…….

||చరణం 1||
జనన జనననన జనన జనననన శివుడి తాండవం ఓంకారం
తకిట తకిట ధిమి తకిట ధింధిమి శబ్ధాకరం ఓంకారం
సర్వ దిక్కుల వ్యాప్తి చెందిన సూర్య కాంతి ఈ ఓంకారం
కాంతి వేగమును ఛేదించగల దైవ కణము ఈ ఓంకారం
వేదమంత్రమీ ఓంకారం, సృష్టి రహస్యమీ ఓంకారం
సూర్యప్రకాశం ఓంకారం ఓంకారం
రాగ ప్రయోగం ఓంకారం, లయల స్వరూపం ఓంకారం
శృతికి-లయకు అనుసంధానమౌ అర్థవంతమౌ ఓంకారం
ఓంకారం ….

||చరణం 2||
శివుని చేతిలో ఢమరుక నాదం, మహాశక్తి మహా స్వరూపం
జగతిని నడుపు త్రిమూర్తుల రూపం, పంచభూతాల ప్రత్యక్షం
సృష్టి దృష్టిలో శబ్దభీజ నిశ్శబ్దమౌనమీ ఓంకారం
భూగోళమునే చీల్చుకుపుట్టిన భువనక భువనం ఓంకారం
పరిశోధనకే ప్రాణం పొసే, పరమ శోధనీ ఓంకారం
పరమ శివుడిలో నాడినాడినా ప్రవహించే ప్రణవ నాదం
సర్వేశ రూపం, ప్రతి జీవిలోని ప్రాణం
బ్రాంతి నివృత్తి, కాంతి ప్రవృత్తి కలగచేసెడిది ఓంకారం

ఓంకారం సృష్టికి రూపం, ఓంకారం శ్వేత సువర్ణం
ఓంకారం సృష్టి నిలుపు మూలం
ఓంకారం జీవన వేదం ఓంకారం జీవన నాదం
ఓంకారం మోక్షమిచ్చు మార్గం

Advertisements

Say what you experienced

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s