చటుక్కునొచ్చి చిటికెలు (జానపదం)

చటుక్కునొచ్చి చిటికెలు వేసి  ఛంగునెగిరిండు  పిల్లగాడు ఓ పోరిని  జూసి పొగడ్తలాడుతు  పొర్లుదండాలు  బెట్టినాడు కళ్ళన కాంతులు నింపుకున్నాడు  పలుమార్లిట్లా పొగడసాగినడు ఆడది కాదిది అప్సరసంటా  అందరి చెవులలో  గుసగుసమన్నాడు కళ్లార్పక ఆ పోరీని జూస్తూ  పాములాగ  తెగ బుసలు కొట్టినడు   మరి ఇదంతా జూసిన ఆ  పోరేమో…   ఔరా ఔరౌరా…ఏమి వీడి అవతారము కన్నెను  సూడని  మొఖమేమో ఇది  కన్నార్పక నను తెగ జూస్తున్నడు కాసంతైనా గమ్ముగుండకా అల్లర  చిల్లర చేసేస్తున్నడు చుట్టూ … More చటుక్కునొచ్చి చిటికెలు (జానపదం)

దండోరా దండోరా (జానపదం)

దండోరా దండోరా… అన్నల్లారా  తమ్ముళ్ళరా ఇంటున్నారా… (పక్కనుండొకడు) సోదాపి ఇసయం  చెప్పరా రే… అగొ ఆ తొందరే వొద్దనేది.. ఇగో ఇను… పక్కూళ్ళోకో సుక్కొచ్చిందట తళ  తళ  మెరుస్తు   సక్కగున్నదట దాన్ని చూసి ఆ ఊరి పోరలు యెంట పడబోయి తొసుకున్నరట ఆ ఊళ్లోని పోరగాళ్ళని పిచ్చోళ్ళని  చేసినాదట  ఆ పోరి పోరి కోసమై అల్లరి పోరలు  ఈలలేస్తూ ఎనకలురికెరట తిరెక్కిన ఆ పోరి చెయ్యి  లేపి మరి సెప్పు జూపెనట ఒక్కసారిగా పోరలందరు బొమ్మలల్లే నిలిసిపోయిరట … More దండోరా దండోరా (జానపదం)

ఊరికెళ్ళొస్తనని (జానపదం)

ఊరికెళ్ళొస్తనని  రానే రాక పోతివి  (2) నీకోసం ఎదురు చూస్త  కన్నార్పకుంటి నేను (2) ఏమైనాదొ ఏ  మాయాపట్టుకున్నాదో (2) పొద్దుబోయె లోగ వస్తనని  నాకు   మాటిస్తివి (2) రాతిరైన  ఇంటివంక కూసంతైన  సూడకుంటివి (2) ఓరికెళ్ళొస్తానని యెడ బోతివి సామి (2) నీకోసం ఎదురు చూస్త కన్నార్పకుంటి నేను (2) …. అఅఅఅఅఅ ? ఏరికోరి తప్ప తాగి ఏదైనా  పడినావ ?(2) మత్తులోన తూగి తూగి మైమరిసి  పోయినావ ?(2) అల్ల నీకు సిన్నదేదైనా … More ఊరికెళ్ళొస్తనని (జానపదం)

ఓంకారం…

శక్తి శక్తి శక్తి, ఇది మూలమంత్ర శక్తి శక్తి శక్తి శక్తి, ఇది ముక్తినిచ్చుసూక్తి, ఇదె ఓంకార శక్తి ||పల్లవి|| ఓంకారం సృష్టికి రూపం, ఓంకారం శ్వేతసువర్ణం ఓంకారం మోక్షమిచ్చు మార్గం ఓంకారం జీవన నాదం, ఓంకారం జీవన వేదం ఓంకారం సృష్టి నిలుపు మూలం యుగయుగాలుగా ధర్మాధర్మాలు ధరియించిన ఈ ఓంకారం తిరుగుచున్న ఈ జీవన చక్రపు జ్ఞానచక్షువీ ఓంకారం సర్వ శక్తుల సమ్మోహనం, ఔన్నత్యమౌ ఆరంభం దివ్య శక్తియై దివిని నడుపు బహు దివ్యమైనదీ … More ఓంకారం…

ప్రశ్నించుకో మనసా..ప్రాణం అంటే అలుసా

కష్టమొచ్చెనని కలత చెందుతూ నీరసించిన ఓ చిరు మనసా తాళ లేని ఓ తీవ్ర వేదనకి ఆపుకుంటావా నీ ఈ శ్వాస బ్రతుకు మని బ్రతుకు చూడమని వేడుకుంటోంది నీ ఎద ఘోష వింటున్నావా మనసా లోలోని మూగ భాష బ్రతికించమంటోంది నీలో ఆశ బదులిమ్మనడిగింది అంతర్ఘోష బ్రతుకు విలువ మరి  తెలుసా తెలిసి కూడా అలుసా ప్రశ్నించుకో మనసా, ప్రాణం అంటే అలుసా… గెలుపు-ఓటముల చిక్కుముళ్లలో, చిక్కుకున్న నీ చివరి శ్వాస మరి ఊతమివ్వమని వేడుకుంటోంది… … More ప్రశ్నించుకో మనసా..ప్రాణం అంటే అలుసా

కష్టమొచ్చెనని కలత చెందుతూ…

కష్టమొచ్చెనని కలత చెందుతూ గుండెలాపుకుని మరణిస్తావా ? బ్రతుకు మలచుకుని మలచి గెలుచుకుని గెలుపు నిలుపుకుని జీవిస్తావా ? చేతకాని నీ పిరికితనంతో భీతి పొందుతూ ప్రాణమొదిలితే నిన్ను నమ్ముకుని బ్రతుకుతున్న నీ వాళ్ళేకెవరు దిక్కు ? నడిమధ్య విడిచిపోకు… నీ పుట్టుకే నీది కానప్పుడు నీ చావే నీకు హక్కేదిరా? చావగలననే ధైర్యం చితి వైపు లాగుతుంటే ఆ తెగువనే చూపి కాష్టాలనీదలేవా ? సమస్యలొస్తే చావొక్కటే పరిష్కారమని నువ్వనుకుంటే శ్మశాన రాజ్యమే మిగులుతుందిరా ఈ … More కష్టమొచ్చెనని కలత చెందుతూ…

పల్లకిలో ఊరేగెను…

||పల్లవి || పల్లకిలో ఊరేగెను శ్రీ సాయిని చూడరే సన్మార్గం చూపే సద్గగరువుని కొనియాడరే అదిగో ఆ రూపం, పేమ కరుణ త్యాగం సాయి అను న్మమం, సకల పాప హరణం పల్లకిలో …. || చరణం1 || సాయి అను స్మరణే, నలు దిక్కుల మ్రోగగనే సుఖశాంతుల ఆ కంతులు భాసిల్లేనులే బాబా అను పిలుపే, ప్రతి మదిలో ఓ తలపై శుభకరమగు మా భకికిి మార్గం చూపెలే చల్లని చూపులతో  మమ్ము కాచే రూపమా అంతేలేని సాగరమంటిది స్వామి నీ పేమ తలచినంతనే కరుణంచే దైవమా ఎంతని … More పల్లకిలో ఊరేగెను…