దండోరా దండోరా (జానపదం)

దండోరా దండోరా… అన్నల్లారా  తమ్ముళ్ళరా ఇంటున్నారా… (పక్కనుండొకడు) సోదాపి ఇసయం  చెప్పరా రే… అగొ ఆ తొందరే వొద్దనేది.. ఇగో ఇను… పక్కూళ్ళోకో సుక్కొచ్చిందట తళ  తళ  మెరుస్తు   సక్కగున్నదట దాన్ని చూసి ఆ ఊరి పోరలు యెంట పడబోయి తొసుకున్నరట ఆ ఊళ్లోని పోరగాళ్ళని పిచ్చోళ్ళని  చేసినాదట  ఆ పోరి పోరి కోసమై అల్లరి పోరలు  ఈలలేస్తూ ఎనకలురికెరట తిరెక్కిన ఆ పోరి చెయ్యి  లేపి మరి సెప్పు జూపెనట ఒక్కసారిగా పోరలందరు బొమ్మలల్లే నిలిసిపోయిరట … More దండోరా దండోరా (జానపదం)

ఊరికెళ్ళొస్తనని (జానపదం)

ఊరికెళ్ళొస్తనని  రానే రాక పోతివి  (2) నీకోసం ఎదురు చూస్త  కన్నార్పకుంటి నేను (2) ఏమైనాదొ ఏ  మాయాపట్టుకున్నాదో (2) పొద్దుబోయె లోగ వస్తనని  నాకు   మాటిస్తివి (2) రాతిరైన  ఇంటివంక కూసంతైన  సూడకుంటివి (2) ఓరికెళ్ళొస్తానని యెడ బోతివి సామి (2) నీకోసం ఎదురు చూస్త కన్నార్పకుంటి నేను (2) …. అఅఅఅఅఅ ? ఏరికోరి తప్ప తాగి ఏదైనా  పడినావ ?(2) మత్తులోన తూగి తూగి మైమరిసి  పోయినావ ?(2) అల్ల నీకు సిన్నదేదైనా … More ఊరికెళ్ళొస్తనని (జానపదం)